: కోట శ్రీనివాసరావుకు 'నవరస నటనా చక్రవర్తి' బిరుదు


ఎన్టీఆర్ 93వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాదు, చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుకు 'నవరస నటనా చక్రవర్తి' బిరుదు ప్రదానం ఘనంగా జరిగింది. వంశీ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్, జీపీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరావు ముఖ్య అతిథిగా హాజరై కోట శ్రీనివాసరావుకు 'నవరస నటనా చక్రవర్తి' బిరుదుతో పాటు ఎన్టీఆర్-జీపీఆర్ లైఫ్ అచీవ్ మెంట్ అవార్డును అందించారు. ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరిట బిరుదును అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News