: టీఆర్ఎస్ పై ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు, అవకతవకలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ ఆరోపణాస్త్రాలు సంధించారు. ఈ మేరకు, ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలసి రాపోలు ఫిర్యాదు చేశారు. పార్టీలు ఫిరాయించిన వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఉన్న విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. జూన్ 1న ఎమ్మల్యే కోటాలో తెలంగాణ శాసనమండలికి ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు సీట్లను గెలుచుకోవడానికి టీఆర్ఎస్ కు అవకాశం ఉన్నప్పటికీ, ఐదో స్థానానికి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఈ క్రమంలో ఐదో అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇతర పార్టీలకు చెందిన నేతలతో టీఆర్ఎస్ మంతనాలు సాగిస్తోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు.