: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ... ఢిల్లీ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ కు ప్రత్యేక అధికారాలపై కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్ధానం ఆప్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లోగా నోటీసుపై స్పందించాలని ఆదేశించింది. అంతేగాక కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ పై పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను విచారించిన సుప్రీం పైవిధంగా స్పందించింది.