: ఆఫీసులో ఫేస్ బుక్ చూస్తే ఇక 'బుక్కే'!


ఆఫీసులో విధులు నిర్వహిస్తూ మీరు ఫేస్ బుక్ చూస్తుంటారా? ఈ కారణంతో ఉద్యోగం కోల్పోయే ప్రమాదముంది సుమా! ఆఫీసులో ఫేస్ బుక్ ఖాతాల్లో చాటింగ్ చేస్తున్న వారిని విధుల నుంచి తొలగించడం తప్పేమీ కాదని ఇటలీ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విషయమేమంటే, ప్రింటర్ అనే వ్యక్తి ఓ కంపెనీని నడుపుతున్నాడు. తన దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి పనివదిలి ఓ యువతితో చాటింగులో ఎక్కువ సమయం గడుపుతున్నాడని అనుమానం వచ్చింది. తన పేరిట ఓ ఫేక్ ఎకౌంటు తెరిచి దాని సాయంతో తన ఉద్యోగి బండారాన్ని బయటపెట్టి ఉద్యోగం నుంచి తొలగించాడు. దీనిపై సదరు ఉద్యోగి కోర్టుకెళ్లగా, ఆఫీసు పనిచేస్తూ ఫేస్ బుక్ చూసేవారిపై నిఘా ఉంచడం చట్ట ఉల్లంఘన కాబోదని కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఈ తరహా కేసులు వస్తే మన కోర్టులు కూడా ఇదే తీర్పిచ్చే అవకాశాలు ఉన్నాయి. సో... బీ కేర్ ఫుల్!

  • Loading...

More Telugu News