: ఎయిర్ టెల్ నుంచి తప్పుకున్న వోడాపోన్


భారత టెలికం రంగంలో మారిన నిబంధనలకు అనుగుణంగా భారతీ ఎయిర్ టెల్ సంస్థలో తామనుభవిస్తున్న 4.2 శాతం వాటాలను విక్రయించినట్టు వోడాఫోన్ వెల్లడించింది. ఇండియన్ టెలికం రంగంలో సేవలందిస్తున్న సంస్థలు మరో టెల్కోలో ఏ విధమైన భాగస్వామ్య వాటాలను కలిగివుండరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారతీ ఎంటర్ ప్రైజస్ (హోల్డింగ్స్) ప్రైవేట్ లిమిటెడ్ లోని 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,270 కోట్లు) విలువైన తమ వాటాలను విక్రయించినట్టు స్పష్టం చేసింది. కాగా, నేటి స్టాక్ మార్కెట్ సెషన్లో భారతీ ఎయిర్ టెల్ ఈక్విటీ విలువ ఉదయం 11 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 3.50 శాతం పెరిగి రూ. 415 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News