: దొంగ ఓట్లతోనే ఓడిపోయానంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి


గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నంచి పోటీచేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గొట్టిముక్కల పద్మారావు టీడీపీ అభ్యర్థిపై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో దొంగ ఓట్ల కారణంగానే తాను ఓడిపోయానని తాజాగా గొట్టిముక్కల ఆరోపిస్తున్నారు. కూకట్ పల్లిలో 4 లక్షల 82 వేల 41 ఓట్లు ఉండగా, అందులో లక్షా 67వేల ఓట్లు దొంగ ఓట్లుగా తేలాయని విలేకర్ల సమావేశంలో చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి అయిన తనకు 57వేల ఓట్లు పడినప్పటికీ దొంగ ఓట్ల కారణంగా ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్టాల్లో ఒకేసారి కాకుండా రెండు విడతలుగా ఎన్నికలు జరగడం వల్ల కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్టు ఓటమి చవిచూశానని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినట్టు గొట్టిముక్కల వెల్లడించారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లను తొలగించి జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఆ నియోజకవర్గంలో కూడా తిరిగి ఉపఎన్నిక జరిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News