: పరిటాల రవి హత్యను మహానాడులో ప్రస్తావించిన చంద్రబాబు... వైయస్ పై తీవ్ర విమర్శలు


మహానాడు చివరి రోజున దివంగత నేత పరిటాల రవీంద్ర హత్యను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. రవికి ప్రాణ హాని ఉందని భద్రతను కల్పించాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించానని... అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో కూడా ఇదే అంశంపై పలుమార్లు చర్చించానని చెప్పారు. దీనికి సంబంధించి లేఖలు కూడా ఇచ్చామని అన్నారు. పరిటాలకు భద్రత పెంచాలని, ఆయనకు ఏదైనా జరిగితే తమరే బాధ్యత వహించాలని వైయస్ కు సూటిగా చెప్పానని తెలిపారు. అయినప్పటికీ, రవికి ఉన్న సెక్యూరిటీని తొలగించి, నిరాయుధుడ్ని చేసి, ఆయనను దారుణంగా హత్య చేశారని చెప్పారు. ఇది వారి అరాచక పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఇంతమంది ఉండి కూడా రవిని కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పాలనలో వందల మందిని హత్య చేశారని చెప్పారు. అరాచక శక్తుల ఆట కట్టిస్తామని, అలాగే మత సామరస్యాన్ని కూడా కాపాడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News