: రిలయన్స్ ఇండస్ట్రీస్ ను అధిగమించి ఐటీ సంస్థ


ఇండియాలో అత్యంత విలువైన కంపెనీల జాబితా మారిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా టాప్ ఇండియన్ కంపెనీగా నిలిచిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ను అధిగమించిన ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుతం టాప్ ఇండియన్ కంపెనీ. ప్రముఖ రీసెర్చ్ సేవల సంస్థ డన్ అండ్ బ్రాడ్ షీట్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, టీసీఎస్ మొదటి స్థానంలో నిలువగా, ఆ తరువాత వరుసగా, రిలయన్స్ ఇండస్టీస్, ఐటీసీ, ఒఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ, హిందుస్థాన్ యూనీలివర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. గడచిన ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత టాప్ 500 కంపెనీలు సంతృప్తికరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ, రికవరీ దిశగా అత్యంత నిదానంగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని డన్ అండ్ బ్రాడ్ షీట్ తెలిపింది. టాప్ -500 కంపెనీల జాబితాలో 2014తో పోలిస్తే 51 కంపెనీలు వచ్చి చేరడం విశేషం.

  • Loading...

More Telugu News