: మోదీని విమర్శించినందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల గ్రూప్ పై మద్రాస్ ఐఐటీ నిషేధం


ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన విధానాలనూ విమర్శించినందుకు మద్రాస్ ఐఐటీ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. క్యాంపస్ లోని అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్ (ఏపీఎస్పీ)పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతకుముందు ఈ గ్రూప్ మోదీకి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ, కొందరు విద్యార్థులు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ ఆదేశాల మేరకు ఏపీఎస్పీని బ్యాన్ చేస్తున్నట్టు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రకటన వెలువరించారు. హిందూ మత సంస్థలు తమపై ఫిర్యాదు చేశాయని ఆరోపిస్తున్న ఏపీఎస్పీ తీవ్ర నిరసన తెలపాలని నిర్ణయించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ స్టూడెంట్స్ గ్రూప్ లో భాగంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News