: 'సువిధ' పేరుతో పరుగులు పెట్టనున్న ప్రీమియం రైళ్లు
డిమాండు పెరిగే కొద్దీ టికెట్ల ధరలు పెరిగేలా అమలవుతున్న 'డైనమిక్ ప్రైసింగ్' విధానానికి మార్పులు చేసి 'సువిధ' పేరిట ప్రీమియం రైళ్లను నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 'డైనమిక్ ప్రైసింగ్' విధానంలో లోపాలుండటంతో వాటిని సరిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విధానంలో ప్రయాణపు తేదీ సమీపిస్తున్న కొద్దీ, టికెట్ల ధరలు డిమాండును బట్టి పెరుగుతుంటాయి. కొన్ని సార్లు థర్డ్ ఏసీ టికెట్ ధర, సెకండ్ ఏసీ కంటే ఎక్కువగా పెరిగిపోతోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, ఇటువంటి ఇబ్బందులు తొలగించేలా కొన్ని మార్పులు చేయనున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. జూలై ఆరంభం నుంచి కొత్త విధానంలో 'సువిధ' రైళ్లు తిరుగుతాయని, వీటికి ఇంటర్నెట్ తో పాటు రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లోనూ టికెట్లు జారీ చేస్తామని అధికారులు వివరించారు.