: ఫోన్ పోతే ఎక్కడుందో చెప్పేలా ఫేస్ బుక్ కొత్త ఫీచర్
పొరపాటున ఎక్కడైనా మీ మొబైల్ ఫోన్ పోయిందా? అదెక్కడుందో మరింత సులువుగా గుర్తించేందుకు ఫేస్ బుక్ ఓ వినూత్న ఫీచరును అందుబాటులోకి తేనుంది. దీని పేరు 'సెక్యూరిటీ చెకప్'. తొలుత దీన్ని ఎంపిక చేసిన కొందరు ఖాతాదారుల న్యూస్ ఫీడ్ లోని పాప్ అప్ మెసేజ్ గా పంపి పనితీరును పరీక్షించనున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. ఆ తరువాత అందరికీ అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. ఈ ఫీచరును యాక్టివేట్ చేసుకుంటే, వారి ఈ-మెయిల్ ఖాతాలకు ఎక్కడి నుంచి లాగిన్ అవుతుందన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇదేదో బాగానే ఉన్నట్టుంది కదా!