: పాక్ మిలిటెంట్లకు పావురాల సహకారం!


పాకిస్థాన్ మిలిటెంట్లు ఇండియాలో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతూ తమవారికి సమాచారం చేరవేసేందుకు పాత పద్ధతులను ఎంచుకుంటున్నారు. సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు పావురాలను వాడుకుంటున్నారు. సరిహద్దులకు అవతలి నుంచి వచ్చిన ఓ పావురాన్ని గుర్తించి దాన్ని పట్టుకున్న పంజాబ్ పోలీసులకు, అది గూఢచర్యం నిమిత్తం వచ్చినట్టు, దానిద్వారా సమాచారం బట్వాడా అవుతున్నట్టు తెలిసింది. పావురం తోకపై ఉర్దూలో కొన్ని పదాలు ఉన్నాయి. దాని శరీరానికి ఓ వైరు చుట్టి ఉంది. పాకిస్థాన్ నరోవాల్ ప్రాంతానికి చెందిన ఓ ల్యాండ్ లైన్ నెంబరు కూడా దానిపై రాసివుంది. భారత సరిహద్దులు దాటి నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చిన ఈ పావురం మన్వాల్ గ్రామంలోని ఓ బార్బర్ ఇంట్లో వాలింది. దీని తోకపై ఏదో రాసి వుండటాన్ని అతని 14 ఏళ్ల కుమారుడు గమనించాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పరుగులు పెట్టాడు. బాలుడి సమాచారంతో పావురాన్ని పట్టుకున్న పోలీసులు దాన్ని ఓ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పావురాన్ని ఎక్స్ రే తీయనున్నట్టు, పావురం తెచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News