: భజ్జీ సినిమా వ్యాపారం
క్రికెటర్లు వ్యాపారం చేయడం, సినిమాల్లో నటించడం సాధారణమైన విషయమే. ఇప్పుడు భారత స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా సినిమా వ్యాపారం మొదలుపెడుతున్నాడు. భారత జట్టులో ఇటీవల కాలంలో తన స్థానం అస్థిరమవుతుండడంతో వ్యాపారం వైపు దృష్టి సారించాడు. బాలీవుడ్ సినిమాలను బాగా ఇష్టపడే ఈ క్రికెట్ స్టార్ హిందీలో రెండు సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు దర్శకులు కూడా ఖరారయ్యారు. కామెడీ అంశాలతో ఈ సినిమాలు తెరకెక్కనున్నాయి. భజ్జీ చిరకాల స్నేహితురాలు గీతా బాస్రా ఈ సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుంటుంది.