: ఈసారి పెళ్లి బృందం ముసుగులో వచ్చి దొరికిపోయిన ఎర్ర స్మగ్లర్లు


ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపినా, స్మగ్లింగ్ మాఫియా ఆగడాలకు కళ్లెం పడడం లేదు. తాజాగా కడప జిల్లా చిన్నమడ్యం దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు దుంగల దొంగలకు చెక్ పెట్టారు. తమిళనాడుకు చెందిన 74 మంది ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఖాకీలకు మస్కా కొట్టేందుకు వీరంతా ఓ పెళ్లి బృందం మాదిరిగా బయలుదేరి తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు బస్సులో వచ్చారు. తనిఖీల్లో భాగంగా వీరిని ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడైంది. తామంతా ఓ పెళ్లికి వెళుతున్నామని చెప్పగా, మహిళలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. నిందితులను విచారిస్తున్న పోలీసులు ఈ అక్రమ రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ దుంగల దొంగలు సేలం ప్రాంతానికి చెందిన వారని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News