: అంజలికి తలనొప్పి తెచ్చిపెట్టిన సచిన్ స్పీడ్!
రోడ్డుపై శరవేగంగా దూసుకుపోతుంటే ఎంతో థ్రిల్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. అది కూడా ఓ బీఎండబ్ల్యూ కారు అయితే... ఇక మాటల్లో చెప్పాలా? సచిన్ టెండూల్కర్ కూడా అలానే చేశాడు. ఇక సచిన్ స్పీడుకు అతని భార్య అంజలి హడలిపోయిందట. తలనొప్పి వచ్చి ఒక రోజంతా బాధపడిందని సచిన్ స్వయంగా తెలియజేశారు. స్వతహాగా మోటార్ రేసింగును ఇష్టపడే సచిన్ కు ఓ బీఎండబ్ల్యూ కారును ఇచ్చి నడిపి చూడమని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. అంజలి కూడా వచ్చి తన పక్కన కూర్చుందని, ఆ సమయంలో చాలా వేగంతో కారును నడిపానని, అంజలితో పాటు తనకూ తలనొప్పి వచ్చిందని తెలిపాడు. అన్నట్టు ఈ ఘటన ఇటీవల జరిగింది కాదటలెండి... ఎప్పుడో జరిగిన ఘటనను సచిన్ గుర్తుచేసుకున్నాడు.