: నిండా నిరాశలో ఉన్నా: చందర్ పాల్
ఈ సిరీస్ తో కెరీర్ ముగిద్దామని భావించానని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివ్ నారాయణ్ చందర్ పాల్ తెలిపాడు. సెలక్టర్లు తనను పరిగణనలోకి తీసుకోకపోవడంతో నిరాశకు గురయ్యానని చందర్ పాల్ వెల్లడించాడు. ఈ సిరీసే తన కెరీర్లో చివరి సిరీస్ అవుతుందని భావించానని, అలా జరగలేదని చందర్ పాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ కు సుదీర్ఘమైన సేవలందించిన చందర్ పాల్ ను నమ్మదగిన అద్భుతమైన ఆటగాడిగా ఆటగాళ్లు పేర్కొంటారు. విండీస్ తో టెస్టు, లేదా వన్డేలో ఏ జట్టు తలపడినా, ప్రణాళికలు, చర్చ జరిగేది చందర్ పాల్ ను ఎలా అవుట్ చేయాలనేదానిపైనే! క్రీజులో నిలదొక్కుకుంటే రోజుల తరబడి పాతుకుపోవడంలో ద్రవిడ్ తరువాతి స్థానం చందర్ పాల్ దే ననడంలో అతిశయోక్తి లేదు. అలాంటి చందర్ పాల్ ను విండీస్ బోర్డు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ కరేబియన్ దిగ్గజ క్రికెటర్ తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు.