: గురువు ఆశీర్వాదం అందుకున్న రజనీకాంత్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువన్న విషయం తెలిసిందే. సినిమాలు లేనప్పుడు ఆయనలోని విరాగి బయటికొస్తాడు. అలాంటి సమయాల్లో రజనీ ఎక్కడెక్కడో ఉన్న గుళ్లూగోపురాలను ఒంటరిగానే చుట్టేస్తారు. హిమాలయాలకు వెళ్లి ఎవరితో సంబంధం లేకుండా తపస్సు చేసుకుంటారు. తాజాగా, ఈ సింపుల్ మేన్ తన ఆధ్యాత్మిక గురువు దయానంద సరస్వతి వద్దకు వెళ్లారు. కోయంబత్తూరు వెళ్లి గురువును సందర్శించి ఆయన ఆశీర్వాదం అందుకున్నారు. గురువుతో కలిసి లంచ్ చేసిన రజనీ ఆశ్రమంలో గంటపాటు గడిపారు. దయానంద సరస్వతిని ప్రతి సంవత్సరం రిషికేశ్ లో కలిసే రజనీ ఈసారి అక్కడికి వెళ్లలేకపోయారు. దీంతో, కోయంబత్తూరు వెళ్లి గురువు ఆశీర్వాదం అందుకున్నారు.