: టీజర్ తోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పిన సల్మాన్


'కిక్' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు కొత్త కళ తెచ్చిన సల్మాన్ ఖాన్ కొత్తసినిమా 'బజరంగీ భాయ్ జాన్' టీజర్ ను ఈ రోజు దుబాయ్ లో విడుదల చేశారు విడుదల. టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు. పాకిస్థాన్ కు చెందిన మూగ బాలిక భారత్ లో తప్పిపోతుంది. బాలికకు సల్లూభాయ్ అండ దొరుకుతుంది. బాలికను పాకిస్థాన్ చేర్చడమే కథగా టీజర్ లో సల్మాన్ చూపించాడు. గతంలో భారత్, పాక్ కథాంశంతో వచ్చిన సినిమాలు బాలీవుడ్ రికార్డులు తిరగరాశాయి. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన 'గథర్-ఏక్ ప్రేమ్ కథ', సల్మాన్ కత్రినా జంటగా నటించిన 'ఏక్ థా టైగర్' వంటి సినిమాలు బాలీవుడ్ ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. మరి 'బజరంగీ భాయ్ జాన్' ఏం చేస్తాడో చూడాలి.

  • Loading...

More Telugu News