: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లలో జోక్యం చేసుకోవద్దని మోదీ చైనాకు చెప్పారు: రాజ్ నాథ్


అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు భారత్ లో అంతర్భాగాలని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు రాష్ట్రాలూ అప్పుడు, ఇప్పుడు, ఎప్పడూ భారత్ లోని భాగాలేనని అన్నారు. వాటి విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన సందర్భంగా ఆ దేశానికి స్పష్టం చేశారని ఆయన చెప్పారు. విదేశీ పర్యటనల ద్వారా మోదీ భారత కీర్తిప్రతిష్ఠలు పెంచారని ఆయన చెప్పారు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతిపాలు చేసిందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News