: ఓ రైతు పొలంలో ఏపీ రాజధాని భూమి పూజ
ఏపీ రాజధాని భూమి పూజకు ముహూర్తం సమీపిస్తోంది. జూన్ 6న ఉదయం 8.49 గంటలకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. తుళ్లూరు మండలం మందడం, తాళ్లాయపాలెం మధ్యన ఉన్న ఓ పొలంలో రాజధాని భూమి పూజ నిర్వహిస్తారు. ఈ పొలం బెజవాడ సత్యనారాయణ అనే రైతుకు చెందినది. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని చదును చేస్తున్నారు. ముహూర్తం నాటికల్లా ఈ ప్రదేశాన్ని అనువుగా తీర్చిదిద్దేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. భూమి పూజ రోజున ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రముఖులు రానుండడంతో ఆ దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి.