: దసరాకు మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేస్తారు: చంద్రబాబు
దసరాకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో నిర్వహించిన మహానాడులో రాజధానిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, జూన్ 6న రాజధానికి భూమిపూజ చేస్తామని అన్నారు. ఎంతమంది అడ్డం వచ్చినా అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గొప్ప నగరాలు నిర్మించిన అనుభవం మనకుందని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.