: అమరావతికి అర్థం చెప్పిన చంద్రబాబు
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు కార్యక్రమంలో అర్థం చెప్పారు. అమరావతి అంటే 'మృత్యువులేని ప్రదేశం' అని అర్థమని వెల్లడించారు. ఎంతో ఆలోచించి రాజధానికి అమరావతి అనే పేరుపెట్టినట్టు సీఎం తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన స్థలమని, భవిష్యత్ లో అమరావతి పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతుందని జోస్యం చెప్పారు. రాజధాని అంటే అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని, రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా కూడా రాజధాని ఉండాలని బాబు అన్నారు. ఇక విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా రైతులు తెలివితో వ్యవహరించి రాజధానికి భూములిచ్చారని పునరుద్ఘాటించారు. సింగపూర్ ఉచితంగా ఏపీకి రాజధాని మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్న బాబు, స్విస్ చాలెంజ్ రూపంలో రాజధాని నిర్మించనున్నట్టు తెలిపారు. ఇంకా మాస్టర్ డెవలపర్ ను ఎంపికచేయాల్సి ఉందని అన్నారు.