: భూసేకరణ బిల్లుపై రైతులను కలసిన అరుణ్ జైట్లీ
గత కొంత కాలంగా విపక్షాలకు ఆయుధంగా మారిన భూసేకరణ బిల్లుపై వివిధ రైతు సంఘాలకు చెందిన నేతలతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమావేశమయ్యారు. ఈ బృందానికి నరేష్ శిరోహి నాయకత్వం వహించారు. భూసేకరణ బిల్లుపై ఉన్న అనుమానాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ, రైతుల వినతులను పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.