: కొడుకు కోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నారు: టీఆర్ఎస్ నేత గట్టు


కుమారుడు నారా లోకేష్ కోసమే మహానాడు పేరుతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. పదిమంది చేత అబద్ధాలు చెప్పిస్తే అదే నిజమవుతుందన్న భ్రమలో బాబు ఉన్నారని, ఆయన చిన్నప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గట్టు మాట్లాడారు. హైటెక్ సిటీ పేరుతో మాయలు, మర్మాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 450 ఎకరాల భూములను బాబు బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News