: కేసు నమోదు చెయ్యలేదు సరికదా సాక్ష్యాలు లాక్కున్నారు
పోలీసుల వ్యవహారశైలిపై ఎన్నో విమర్శలు రేగుతుంటాయి. బీహార్ లోని పాట్నాలో 16 ఏళ్ల యువతి దినేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. సాన్నిహిత్యం పెరగడంతో బాలిక గర్భందాల్చింది. దీంతో యువకుడు ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కౌన్సిలింగ్ తో వివాహం చేసుకున్న దినేష్ తరువాత కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. వారు ఆమెను హింసిస్తున్న సమయంలో వీడియో చిత్రీకరించారు ఆమె కుటుంబ సభ్యులు. దీనిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, కేసు నమోదు చేయని మహిళా కానిస్టేబుల్ ఆమె దగ్గరనున్న వీడియో సాక్ష్యాన్ని లాక్కున్నారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. వారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.