: ఆసుపత్రిపాలైన సినీ నటుడు ధర్మేంద్ర
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (79) ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్యం సరిగాలేదని అందుకే ఈరోజు దక్షిణ ముంబయిలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. అయితే ధర్మేంద్ర వైద్య పరిస్థితిపై మాట్లాడేందుకు ఆసుపత్రి అధికారులు నిరాకరించారని తెలియగా, మరోవైపు రొటీన్ చెకప్ లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.