: పాకిస్థాన్ లో హిందూ యువతికి ఉద్యోగం నిరాకరణ


భారత్ లో ముస్లిం అంటూ ఓ యువకుడికి ఉద్యోగం నిరాకరించడం, మరో యువతికి అద్దె ఇల్లు ఇవ్వకపోవడం వంటి సంఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఇలాంటి ధోరణే పొరుగుదేశం పాకిస్థాన్ లోనూ కనిపిస్తోంది. అక్కడ, 'హిందూ' అంటూ సంధ్య అనే యువతికి ఉద్యోగం నిరాకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె చదువుకున్న విద్యాసంస్థే ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. "నువ్వు హిందూ స్త్రీవి" అంటూ మొండిచేయి చూపారట. బీబీసీ వార్తా సంస్థ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. పాక్ లో హిందువులు మైనారిటీలన్న సంగతి తెలిసిందే. భారత్ లో ముస్లింల స్థితిగతులతో పోల్చితే, పాక్ లో హిందువులు దుర్భర స్థితిలో గడుపుతున్నట్టే భావించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News