: ఆస్ట్రేలియా ఓపెన్ లో ముగిసిన శ్రీకాంత్, గుత్తా జ్వాల పోరాటం


ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో ఉన్న తెలుగుతేజం శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. రెండో రౌండ్ లో అన్ సీడెడ్ చైనీస్ ఆటగాడు తియాన్ హువీ చేతిలో 21-18, 17-21, 13-21 తేడాతో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్ లో సత్తా చాటిన శ్రీకాంత్ ఆ తర్వాతి రెండు గేముల్లో వెనుకంజ వేశాడు. మరోవైపు, మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల-అశ్వినిల పోరు కూడా ముగిసింది. ఇండొనేషియాకు చెందిన నిత్యా క్రిషిందా మహేశ్వరి- గ్రేసియా చేతిలో 14-21, 10-21 తేడాతో భారత జంట ఓటమిపాలయింది.

  • Loading...

More Telugu News