: సల్మాన్ 'హిట్ అండ్ రన్' కేసు పేపర్లు అగ్నికి ఆహుతయ్యాయట!


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతయ్యాయట. ఈ విషయం సంబంధిత అధికారులు ఇచ్చిన సమాధానం ద్వారా తాజాగా వెల్లడైంది. ఈ కేసులో ప్రభుత్వం నుంచి నియమితులైన న్యాయ సలహాదారులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్లు, ఈ కేసుకు ప్రభుత్వం చేసిన ఖర్చు... తదితర వివరాలు తెలపాలంటూ మహారాష్ట్ర హోంశాఖ, న్యాయ శాఖలకు ఆర్టీఐ ఉద్యమకారుడు మన్సూర్ దర్వేష్ ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందుకు వారిచ్చిన సమాధానంలో, 2012లో మంత్రాలయ (ఆ రాష్ట్ర సచివాలయం)లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ కేసుకు సంబంధించిన పత్రాలు కాలిపోయాయని, అందువలన అవి అందుబాటులో లేవని తెలిపారట. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య సమాధానంపై దర్వేష్ మండిపడుతున్నాడు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ప్రభుత్వం తిరిగి ఆ ఫైల్స్ ను పునరుద్ధరించాలని కోరుతున్నాడు.

  • Loading...

More Telugu News