: అందంగా ఉన్నవాళ్లు తప్పు చేసినా ఫర్వాలేదట!
కాస్త అందంగా, ఆకర్షణీయంగా కనిపించేవాళ్లు తప్పు చేస్తే వాళ్లను మహిళలు ఈజీగా క్షమించేస్తారనే విషయం ఓ అధ్యయనంలో తేలింది. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే అతడిని క్షమించాలా? వద్దా? అనే విషయం దీనిమీదే ఆధారపడుతుందని, అమెరికాలోని ఈస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్సన్, జొనాథన్ గోర్ లు పరిశోధించి తేల్చారు. వారి పరిశోధనలో అందంగా ఉన్నవారు తప్పు చేస్తే తొందరగా క్షమించేసేందుకు పెద్దగా సమయం పట్టదని, ఓ మోస్తరుగా ఉన్నవాళ్లు తప్పు చేస్తే వారిని క్షమించేందుకు మహిళలు కొంత సమయం తీసుకుంటారని వీరు చెప్పారు. అదే సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం చెంపదెబ్బలు తప్పవని వారు స్పష్టం చేశారు. ఈ పరిశోధన కోసం 170 కళాశాలలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలపై పరిశోధనలు చేసినట్టు వారు వెల్లడించారు. వీరందరికీ బాగా ఆకర్షణీయంగా ఉండేవాళ్ల, అసలు ఆకర్షణీయంగా ఉండని వారి ముఖాలు చూపించి, వివిధ సందర్భాలను సృష్టించి ఇచ్చి, వారి రియాక్షన్లు ఎలా ఉన్నాయో గమనించి ఫలితాలు వెల్లడించారు.