: జూన్ లో తైవాన్, హాంగ్ కాంగ్ లలో కేటీఆర్ పర్యటన
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జూన్ లో తైవాన్, హాంగ్ కాంగ్ దేశాల్లో పర్యటించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. జూన్ 3 నుంచి 6 వరకు ఈ పర్యటన ఉంటుందని తెలిపారు. అమెరికాలో మూడు వారాల పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా హైదరాబాదులో పాత్రికేయులు ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ ఈ విషయాన్ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించే లక్ష్యంగా ఈ విదేశీ పర్యటన చేయబోతున్నానన్నారు.