: చెన్నయ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు
టీడీపీ కార్యకర్త చెన్నయ్య కుటుంబానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు ప్రకటన చేశారు. మహానాడులో పాల్గొనేందుకు విచ్చేసిన చెన్నయ్య... కార్యక్రమ ప్రాంగణంలోనే అస్వస్థతకు గురై మృతి చెందాడు. చెన్నయ్య ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన మృతికి సంతాపంగా మహానాడులో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.