: విశాఖ ఏజెన్సీలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అడవిలో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు తెలిసింది. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. నిన్న (గురువారం) కూడా కొయ్యూరు మండలం చీడిపల్లి అటవీ ప్రాంతంలో 15 రౌండ్ల కాల్పులు జరిగాయని తెలిసింది.