: రూ. కోటి వేతనం కావాలంటే, ఈ కంపెనీల్లో ట్రై చెయ్యండి!


ఇప్పుడు వస్తున్న వేతనాలు చాలట్లేదా? సంవత్సరానికి కోటి రూపాయల జీతం ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీరు ఇ-కామర్స్ రంగంలోని కంపెనీల్లో దూరిపోయేందుకు కృషి చెయ్యండి. ఎందుకంటే ఈ సంవత్సరం ముగిసేలోగా ఫ్లిప్ కార్ట్, అమేజాన్, స్నాప్ డీల్, ఓలా, ఉబెర్, క్విక్కర్, యప్ మీ, ఓఎల్ఎక్స్, జంగ్లీ, హంగామా, బుక్ మై షో, జబాంగ్, క్లియర్ ట్రిప్, లెన్స్ కార్ట్ తదితర సంస్థలు 500 వరకూ సీనియర్ స్థాయి ఉద్యోగులకు కోటి రూపాయలకు పైగా వేతనాన్ని ఆఫర్ చేసి విధుల్లోకి తీసుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆర్ జీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్, లాంగ్ హౌస్ కన్సల్టింగ్ తదితర ఐదు సెర్చ్ సంస్థలు విడుదల చేసిన అంచనాలు స్పష్టం చేశాయి. గడచిన ఆరు నెలల్లో ఇ-కామర్స్ రంగంలోని 100కు పైగా సీనియర్ స్థాయి ఉద్యోగాలపై సమాచారం సేకరించినట్టు ఏబీసీ కన్సల్టెంట్స్ డైరెక్టర్ సిద్ధార్థ రాయ్ సురానా తెలిపారు. సీనియర్ ఉద్యోగులకు సాలీనా కోటి రూపాయలు ఇచ్చేందుకు ఈ సంస్థలు వెనుకాడడం లేదని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇ-కామర్స్ సంస్థల్లో కొత్త ఉద్యోగుల నియామకాలు 30 నుంచి 40 శాతం పెరగనున్నాయని వివరించారు. ప్రస్తుతం తమ సంస్థలో 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపిన స్నాప్ డీల్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ నిగమ్, ఇక వీరిని ముందుకు నడిపించే లీడర్లను నియమించడంపై దృష్టిని సారించామని అన్నారు.

  • Loading...

More Telugu News