: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల... ఇంజినీరింగ్ లో 70.65 శాతం ఉత్తీర్ణత


తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ లో 90,556 (70.65 శాతం ఉత్తీర్ణత) మంది అర్హత సాధించగా, మెడిసిన్ లో 78,794 (85.98 శాతం ఉత్తీర్ణత) మంది అర్హత సాధించినట్టు మంత్రి వెల్లడించారు. ఈ నెల 29 నుంచి ఓఎంఆర్ షీట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ సాయి సందీప్ (157 మార్కులు), ద్వితీయ ర్యాంక్ రౌతు నిహార్ చంద్ర (156 మార్కులు), మూడవ ర్యాంక్ బేబీ కీర్తన (155 మార్కులు), నాలుగవ ర్యాంక్ గుత్తా సాయి తేజ (155 మార్కులు), ఐదవ ర్యాంక్ వెన్నపూస హేమంత్ రెడ్డి (154 మార్కులు), ఆరవ ర్యాంక్ శ్రీహర్ష (154 మార్కులు), ఏడవ ర్యాంక్ సందీప్ కుమార్ (153 మార్కులు), ఎనిమిదవ ర్యాంక్ శ్రీకర్ (153 మార్కులు), తొమ్మిదవ ర్యాంక్ దొంతుల అక్షితరెడ్డి (153 మార్కులు)లకు వచ్చాయని వివరించారు. ఇక మెడిసిన్ లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పలపాటి ప్రియాంక (160 మార్కులు)కు ప్రథమ ర్యాంక్ వచ్చినట్టు కడియం వెల్లడించారు.

  • Loading...

More Telugu News