: మండే ఎండలతో సెలవుల పొడిగింపు


జూనియర్ కళాశాలల వేసవి సెలవులను పొడిగిస్తున్నట్టు ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత తగ్గకపోవడంతో బాటు, మరో వారం పది రోజులు ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని వాతావరణ శాఖల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల వేసవి సెలవులను వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు తెలిపింది. వాస్తవానికి అకడమిక్ కేలండర్ ప్రకారం జూన్ ఒకటో తేదీన కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. మారిన తేదీల ప్రకారం జూన్ 8వ తేదీ నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ప్రారంభించాలని, ఈ విషయాన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు గమనించాలని ఇంటర్ బోర్డు తెలియజేసింది.

  • Loading...

More Telugu News