: వైభవంగా లోకేష్ కుమారుడి నామకరణ మహోత్సవం!


నారా వారి వంశ వారసుడు; లోకేష్, బ్రహ్మణి దంపతుల పుత్రుడి నామకరణ మహోత్సవం ఎన్టీఆర్ జయంతి రోజైన నేడు వైభవంగా జరిగింది. చిన్నారికి 'దేవాన్ష్' అని పేరు పెట్టారు. ఈ ఉదయం తమ నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. "మా తాతయ్య జయంతి వేడుకలు జరుపుకునే పర్వదినాన, మా కుమారుడికి 'దేవాన్ష్' అనే పేరు పెట్టాము" అని లోకేష్ వివరించారు. (On this auspicious day of our grand father's birthday, we announce the name of our son "Devaansh") అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు, బాలకృష్ణ దంపతులు, ఇతర బంధుమిత్రులు పాల్గొని దేవాన్ష్ ను ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News