: చేతికి కట్టుతోనే వచ్చి తండ్రికి నివాళులర్పించిన భువనేశ్వరి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ ఉదయం హైదరాబాదు, నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆయనకు ఘన నివాళులు అర్పించింది. భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ తదితరులతో వచ్చిన ఆయన ఎన్టీఆర్ ఘాట్ పై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఆయన భార్య భువనేశ్వరి కుడి చేతి మణికట్టు ఎముక విరిగిన నేపథ్యంలో, ఆమె కట్టుతోనే వచ్చి నివాళులు అర్పించారు. చంద్రబాబునాయుడి వెంటే ఉన్న బాలకృష్ణ, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మహానేతకు అంజలి ఘటించారు. అంతకు కొద్దిసేపటి ముందు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సైతం అక్కడికి వచ్చి పూలు చల్లి కన్నీరు పెట్టుకున్నారు.