: పోలీసుల అత్యుత్సాహంతో మహానాడులో ఇబ్బందులు పడ్డ తెలుగుదేశం నేతలు


ఎవరు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి. అసలు లోపలకు వెళ్లేందుకే ఇబ్బందులు. మహానాడులో తొలిరోజు కార్యకర్తలకే కాదు. ఎమ్మెల్యేలకు కూడా పోలీసుల నుంచి అడ్డంకులు ఏర్పడ్డాయి. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నుంచి గౌతు శివాజీ, సోమిరెడ్డి తదితరుల వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి ప్రతియేటా మహానాడులో సీట్ల ఏర్పాటు బాధ్యతలు పార్టీ కార్యకర్తలే చూసుకునేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళలు, మీడియా... ఇలా వివిధ రకాల బ్లాకులను ఏర్పాటు చేసేవారు. ఈ దఫా మొత్తం పోలీసులకు అప్పగించడంతో వారు అడుగడుగునా తనిఖీలు, భద్రత పేరుతో ఇబ్బందులు పెట్టారని పలువురు విమర్శించారు. తాము ఎమ్మెల్యేలమంటూ గుర్తింపు కార్డులు చూపించినా ప్రధాన మార్గం గుండా వెళ్లేందుకు పలువురికి అనుమతి లభించలేదు. ఒకదశలో వారితో గొడవ పడబోయారు కూడా. పోలీసుల అత్యుత్సాహం పట్ల తెలుగుదేశం నేతలు అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News