: ఎన్టీఆర్ ఘాట్ కు క్యూ కట్టిన నందమూరి వారసులు
నేడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నందమూరి వంశ వారసులు హైదరాబాదు, నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ కు క్యూ కట్టారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు ఇప్పటికే ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. మరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, ఆయన సోదరులు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకోనున్నారు. నేడు జరగనున్న మహానాడు రెండవ రోజు సమావేశాల్లో భాగంగా, గండిపేటలో కూడా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.