: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు లెక్కలు తేల్చిన కాగ్
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదాయ లోటు లెక్కలను కాగ్ లెక్కగట్టింది. మొత్తం రూ.14 వేల కోట్లకు రెవెన్యూ లోటు చేరుకుందని తెలిపింది. పూర్తి గణాంకాలతో ఏపీ ప్రభుత్వానికి ఓ నివేదికను కాగ్ అధికారులు అందజేశారు. కాగా, ఈ లోటులో కేవలం రూ.2,300 కోట్లు మాత్రమే ఇప్పటివరకూ కేంద్రం నుంచి అందింది. దీంతో, మిగతా మొత్తాన్ని కూడా ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఇక ఈ లోటు ఎప్పటికి పూడుతుందో, కేంద్రం సర్కారు నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందో వేచి చూడాలి.