: టాప్ 500 కంపెనీల్లో 21 'తెలుగు' కంపెనీలు


ఇండియాలోని టాప్ 500 కంపెనీల జాబితాను డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ (డీ అండ్ బీ) విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు ప్రధాన కేంద్రంగా సాగుతున్న 21 కంపెనీలకు చోటు లభించింది. ఈ ఏడాదికి డీ అండ్ బీ విడుదల చేసిన జాబితాలో గనుల రంగంలో సేవలందిస్తున్న ఎన్ఎండీసీ 24వ స్థానంలో నిలువగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 31వ స్థానంలో నిలిచింది. ఈ 21 కంపెనీల్లో ఫార్మా రంగం నుంచి నాలుగు, బ్యాటరీ తయారీ రంగంలోని మూడు, ఇనుము, ఉక్కు రంగం నుంచి రెండు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ (67), అపోలో హాస్పిటల్స్‌ (79), అమర రాజా బ్యాటరీస్‌ (123), బిఎస్‌ లిమిటెడ్‌ (209), సైయెంట్‌ లిమిటెడ్‌ (222), ఎన్‌సీసీ లిమిటెడ్‌ (259), ఆంధ్రా బ్యాంక్‌ (302), అరబిందో ఫార్మా (305), హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ (316), హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ (391), స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా లిమిటెడ్‌ (394), నవ భారత్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (404), అవంతి ఫుడ్స్‌ (417), రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (445), సంఘీ ఇండస్ట్రీస్ (448), కావేరీ సీడ్స్‌ (480), గ్రాన్యూల్స్‌ ఇండియా (483), శ్రీకాళహస్తి పైప్స్‌ (485), ఎక్సెల్‌ క్రాప్‌ కేర్‌ (493) సంస్థలకు చోటు లభించింది.

  • Loading...

More Telugu News