: పోలీస్ స్టేషన్లో సన్నీ లియోన్!
బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. థానేలోని సైబర్ క్రైమ్ సెల్ కు హాజరై విచారణ ఎదుర్కొంది. వెబ్ సైట్లలో అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలతో యువతను పెడదోవపట్టిస్తోందని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని డాంబివలికి చెందిన మహిళ థానే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఐటీ యాక్ట్, మహిళలను అసభ్యకరంగా చూపించడాన్ని నిరోధించే యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల పిలుపు మేరకు ఆమె థానే సైబర్ క్రైమ్ సెల్ కు వచ్చారు. కెనడాలో పోర్న్ స్టార్ గా గుర్తింపు ఉన్న సన్నీ లియోన్, బాలీవుడ్ లో ఫ్రెష్ కెరీర్ స్టార్ట్ చేసింది. నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆమెపై ఉన్న పోర్న్ స్టార్ ముద్ర ఇంకా చెరిగిపోవడం లేదు.