: కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా ఒంటికి నిప్పంటించుకున్న వ్యక్తి


నల్లగొండలో బుధవారం బీజేపీ సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ సభలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా... శంకర్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని, వేదిక దిశగా పరుగులు పెట్టాడు. ఇది చూసి సభకు హాజరైన వారు హడలిపోయారు. వెంటనే తేరుకుని, అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగం కొనసాగింది. కాగా, ఆత్మహత్యకు యత్నించిన శంకర్ నల్లగొండ సమీపంలోని కేశరాజుపల్లి వాసి. కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు అంగీకరించకపోవడంతో, శంకర్ ఆత్మహత్య చేసుకునేందుకు తెగించాడు.

  • Loading...

More Telugu News