: భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదు: కేంద్ర మంత్రి


భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లావట్ స్పష్టం చేశారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూసేకరణ బిల్లులో మార్పులు కావాలంటే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం తప్ప బిల్లుపై వెనక్కి తగ్గే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. బిల్లును కేంద్రం పార్లమెంటు జాయింట్ కమిటీకి పంపించిందని, వర్షాకాల సమావేశాల నాటికి బిల్లు పార్లమెంటుకు చేరుతుందని గెహ్లావట్ తెలిపారు. వర్షాకాల సమావేశాల నాటికి బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News