: ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ లో సైనా శుభారంభం... నిరాశపర్చిన సింధు
భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల విభాగం సింగిల్స్ తొలి రౌండ్ పోటీల్లో సైనా 21-12, 21-10తో చియా లిడియా (మలేసియా)పై అలవోకగా విజయం సాధించింది. తెలుగుతేజం పీవీ సింధు నిరాశపర్చింది. సింధు 21-18, 15-21, 23-25 తో ఎనిమిదో సీడ్ వాంగ్ యిహాన్ చేతిలో పరాజయంపాలైంది. అటు, పురుషుల విభాగం సింగిల్స్ లో శ్రీకాంత్ 14-21, 21-8, 22-20తో విట్టింఘస్ (డెన్మార్క్) పై అద్భుత విజయం అందుకున్నాడు. ఇక, మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ రెండో రౌండ్ లో ప్రవేశించింది.