: జీవిత లక్ష్యం నెరవేర్చుకున్న జాకీ చాన్
'బ్రూస్ లీ'లా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో హాలీవుడ్ రంగప్రవేశం చేసిన జాకీ చాన్, అతని మరణానంతరం అంత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అబ్బురపరిచే మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలే కాకుండా, కడుపుబ్బ నవ్వించే కామెడీ చేసే జాకీ చాన్ వయసు పైబడడంతో, సినిమాలు తగ్గించుకున్నాడు. దీంతో తన జీవిత లక్ష్యమైన 'యాక్టింగ్ స్కూల్' (ఫిల్మ్ అండ్ టెలివిజన్) ను ప్రారంభించాడు. చైనాలోని వుహాన్ అనే నగరంలో జాకీ ఈ స్కూల్ ప్రారంభించినట్టు 'సినా' అనే వెబ్ పోర్టల్ తెలిపింది. చైనా ప్రముఖ నటులందరూ ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ స్కూల్ లో నటన, యానిమేషన్, డిజిటల్ మీడియా పరిజ్ఞానంపై మెళుకువలు నేర్పుతారు.