: వందేళ్లలోగా ఎవరెస్టు హిమానీనదాలు మాయం అవుతాయట!
ప్రఖ్యాతిగాంచిన ఎవరెస్టు హిమానీనదాలు వందేళ్లలోగానే అదృశ్యమవుతాయని నెదర్లాండ్స్, నేపాల్, ఫ్రాన్స్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటమే దీనికి కారణమని చెబుతున్నారు. భూతాపం వల్ల హిమానీనదాలకు ముప్పు పొంచి ఉందని వారంటున్నారు. 1977-2010 మధ్య కాలంలో నేపాల్ లోని హిమానీనదాలు మూడో వంతు తరిగిపోయాయన్న చేదు నిజాన్ని వారు ఉదాహరణగా చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వందేళ్లలోపు ఎవరెస్ట్ హిమానీనదాలు కనుమరుగవుతాయని హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోగలిగినప్పటికీ, 70 శాతం వరకు గ్లేసియర్స్ కుచించుకుపోతాయని అంటున్నారు.