: తొలిసారి ఎంపీ అయిన వ్యక్తికి 'సన్సద్ రత్న 2015 అవార్డ్'
రాజస్థాన్ కు చెందిన భారతీయ జనతా పార్టీ నేత, తొలిసారి లోక్ సభ సభ్యుడైన పీపీ చౌదరి 'సన్సద్ రత్న 2015 అవార్డు'కు ఎంపికయ్యారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఆయన పనితీరుకు గానూ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. "ఈ అవార్డుకు ఎంపికైన నలుగురు లోక్ సభ సభ్యుల్లో చౌదరి ఒకరు. 16వ లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో విశిష్ట ప్రదర్శనకుగానూ వారిని ఎంపిక చేశాము" అని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ చైర్మన్ కె.శ్రీనివాసన్ తెలిపారు.