: తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సదారాంపై టీ.వైసీపీ ఫిర్యాదు


తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజా సదారాంపై ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తెలంగాణ వైసీపీ ఫిర్యాదు చేసింది. సదారాం అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ఆయన తీరు అప్రజాస్వామికమని తెలంగాణ వైసీపీ నేతలు కె.శివకుమార్, రహ్మాన్ లు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని భన్వర్ లాల్ ను కోరారు. అంతేగాక తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News